భారత్ న్యూస్ శ్రీకాకుళం….చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
చిత్తూరు జిల్లా సదుం మండలంలో బర్డ్ ఫ్లూ విజృంభించింది. మండలంలోని అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు మృతి చెందినట్లు ఎంఆర్వో ప్రమీల శుక్రవారం తెలిపారు.
మృతి చెందిన కోళ్ల నమూనాలను పరీక్షలకు పంపగా బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని కలెక్టర్ తెలిపారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.