భారత్ న్యూస్ ఢిల్లీ…..ఉద్యాన పంటలకు రాయితీ డబ్బులు విడుదల :
🔴 రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేశారు.
🔴 రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏప్రిల్ 3 నుంచి 22 వరకు కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.. ఈ మేరకు ఉద్యానశాఖ ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదించింది.

🔴 ఈ మేరకు రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఏప్రిల్ 3 నుంచి 5 వరకు జరిగిన పంట నష్టానికి రూ.90.85 లక్షలు చొప్పున.. ఏప్రిల్ 7 నుంచి 22 వరకు జరిగిన పంట నష్టానికి రూ.4.47 కోట్లు విడుదల చేసినట్లు విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఈ డబ్బుల్ని రైతులు అకౌంట్లలోకి జమ చేస్తున్నారు.