PM Kisan: పీఎం కిసాన్‌ దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు.. కొత్తవారికి అవకాశం ఉందా? ఈ కార్డు ఉంటేనే!

భారత్ న్యూస్ గుంటూరు…PM Kisan: పీఎం కిసాన్‌ దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు.. కొత్తవారికి అవకాశం ఉందా? ఈ కార్డు ఉంటేనే!

PM Kisan Eligibility: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే, ఈరోజు మార్చి 13న 22వ విడుత నిధులు అసోంలోని గువహటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కొత్తగా పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి? వాటి నియమాలు ఏంటి ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

2019లో ప్రధాన మంత్రి మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా రూ.6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమా అవుతున్నాయి. మూడు విడుతల్లో ఈ నిధులు రూ.2000 చొప్పున విడుదల చేస్తారు.

9 కోట్ల మంది రైతులకు లాభం..
ఈ పీఎం కిసాన్‌ పథకం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ ప్రకారం 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో మహిళా రైతులు 2.15 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ పీఎం కిసాన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.4.25 లక్షల కోట్లకు చేరింది. 2025 నవంబర్‌ నెలలో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గత విడుత విడుదల చేశారు. ఇందులో 9 కోట్ల మందికి పైగా రైతులు రూ.18000 కోట్లు పొందారు.

ఈకేవైసీ పూర్తి చేస్తేనే..
పీఎం కిసాన్‌ నిధులు పొందాలంటే మందుగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకారం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన రైతులందరూ ఈకేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా జమ అవుతాయి..

ప్రధానమంత్రి కిసాన్‌లో మీ స్టేటస్‌ చెక్‌ చేయండి.. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా మీరు మీ స్టేటస్‌ కూడా చెక్‌ చేసుకోవచ్చు. ‘Know Your Status’ లబ్దిదారుల స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఈ అధికారిక వెబ్‌సైట్‌లోనే మీరు సులభంగా పేమెంట్‌ స్టేటస్‌, అర్హత, ఆధార్‌ లింకింగ్‌, ఈకేవైసీ పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే కాదు.. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా కూడా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఓటీపీ వెరిఫికేషన్‌తోపాటు బయోమెట్రిక్‌ కూడా చేసుకోవచ్చు

ఎల్‌పీజీ.. సీఎన్‌జీ ఎలా తయారు చేస్తారు? పూర్తి ప్రక్రియ ఎలా ఉంటుంది? తెలుసుకోండి..

ఏఐ సహాయంతో..
కిసాన్‌ ఇమిత్ర ద్వారా ఏఐ సహాయంతో దేశవ్యాప్తంగా 11 స్థానిక భాషల్లో చాట్‌బాట్‌ ద్వారా లక్షల మంది సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ పథకానికి ఫార్మర్‌ ఐడీ కూడా తప్పనిసరి చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

స్టేటస్‌ చెక్‌ చేసుకునే విధానం..
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్టేటస్‌ చెక్‌ చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ ఓపెన్‌ చేసి ‘Beneficiary List’ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. అందులో స్టేట్‌, జిల్లా, సబ్‌ డిస్ట్రిక్‌, బ్లాక్‌, గ్రామం వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ‘Get Reports’ క్లిక్‌ చేయాలి. అప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో గ్రామాలవారీగా వివరాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 2026 ఫిబ్రవరి 24వ తేదీ నాటికి పీఎం కిసాన్‌ పథకం ప్రారంభించి 7 ఏళ్లు పూర్తవుతుంది.