ఇలా చేస్తే రైతులకు నష్టాలే ఉండవు!

భారత్ న్యూస్ అనంతపురం,ఇలా చేస్తే రైతులకు నష్టాలే ఉండవు!

రేయింబవళ్లు శ్రమించినా దళారుల మోసాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాకు చెందిన పసుపు రైతు శివాజీ కుర్హే వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పసుపును నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. దీనికోసం పసుపు పట్టే గ్రైండర్ కలిగిన ప్రత్యేక వాహనాన్ని వాడుతున్నారు. ఇలా రోజుకు దాదాపు 50Kgs పసుపును అమ్మి లాభాలు పొందుతున్నారు. ఈ రైతుపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి….