భారత్ న్యూస్ మంగళగిరి…ఈ-పంట నమోదు చివరి దశలో రైతులు జాగ్రత్త!
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటివరకు 50 శాతం లోపే ఈ-పంట నమోదు పూర్తయింది.
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రైతులు తప్పనిసరిగా తమ దగ్గరలోని రైతు సేవా కేంద్రాల (RBKs) ద్వారా పంట నమోదు చేసుకోవాలి అని ప్రభుత్వం సూచించింది.
తమ పంట వివరాలు సరిచూసుకుని ఖచ్చితంగా నమోదు చేయాలి.
తుది జాబితా ఈ నెల 31వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది.
అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి.
