దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం,

భారత్ న్యూస్ నెల్లూరు….దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం

రైతు సమస్యలపై చర్చ, కనీస మద్దతు ధర, రైతుబంధు పథకాల ప్రచారంపై నిర్ణయం.

అవనిగడ్డ, నవంబర్ 17: దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం నాడు చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వర రావు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు ముఖ్య సమస్యలపై పాలకవర్గం మరియు అధికారుల మధ్య విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. రైతులకు మరింత అండగా నిలవాల్సిన అవసరాన్ని చైర్మన్ ఈ సందర్భంగా అదేశించారు ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన రైతుబంధు పథకము యొక్క ప్రయోజనాలను గురించి రైతులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా, ఈ కీలక సమాచారాన్ని పాంప్లెట్ల రూపంలో ముద్రించి, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, అవనిగడ్డ మండలాల పరిధిలోని రైతులందరికీ పంపిణీ చేయడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకున్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ కొల్లూరి వెంకటేశ్వరరావుతో పాటు, వైస్ చైర్మన్ శ్రీ రాజునాల వీరబాబు, పాలకవర్గ సభ్యులు, మరియు కార్యదర్శి శ్రీ ఎం. శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.