నేడు గురు పౌర్ణమి(వ్యాస పూర్ణిమ)

భారత్ న్యూస్ గుంటూరు…..నేడు గురు పౌర్ణమి(వ్యాస పూర్ణిమ)

గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తూ నిర్వహించుకునే వేడుక ‘గురు పౌర్ణమి’ని తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ ఏడాది గురు పౌర్ణమి గురువారం రోజున రావడం ప్రత్యేక విశేషంగా భక్తులు భావిస్తున్నారు. ఈసందర్భంగా ఆయాప్రాంతాల్లోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగానూ పేర్కొంటారు. ఇదేరోజున వేదవ్యాస మహర్షి జన్మతిథి కావడంతో, వ్యాస భగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.