క్యూఆర్​ కోడ్​తో పాస్​ పుస్తకాలు – ఆగస్టు 15 నుంచి ఉచితంగా అందజేత,

భారత్ న్యూస్ శ్రీకాకుళం….Ammiraju Udaya Shankar.sharma News Editor…క్యూఆర్​ కోడ్​తో పాస్​ పుస్తకాలు – ఆగస్టు 15 నుంచి ఉచితంగా అందజేత

రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష – పేదల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చ

వారసత్వంగా 10లక్షల విలువ చేసే భూములకు సంబంధించిన సెక్షన్ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయంలోనే రూ.100

10 లక్షల పైబడిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్ తీసుకునే చర్యలు

క్యూ ఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకురావటం ద్వారా ప్రతి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి పండుగ వాతావరణంలో ఉచితంగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పేదల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రూ.10 లక్షల విలువైన వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించిన సెక్షన్ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయంలోనే రూ.100 చెల్లించి పొందే విధంగా వెసులుబాటు కల్పించాలని కీలకంగా నిర్ణయించారు. రూ.10 లక్షల