ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి: విశాఖ ఎస్పీ

భారత్ న్యూస్ విశాఖపట్నం.ఆంధ్రప్రదేశ్ :

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి: విశాఖ ఎస్పీ

అల్లూరి జిల్లా కింటుకూరలో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.

విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు.

ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేతలు గాజుల రవి, వెంకట రవి చైతన్య, అంజు మృతి చెందినట్టు తెలిపారు.

వీరిపై రూ.25 లక్షలు, రూ.20 లక్షలు, రూ.లక్ష రివార్డులు ఉన్నాయని చెప్పారు..