భారత్ న్యూస్ శ్రీకాకుళం…Ammiraju Udaya Shankar.sharma News Editor…మా ఎమ్మెల్యే ల పనితీరు అస్సులు బాలేదు.
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
మీడియాతో మంత్రి నారా లోకేష్ వెల్లడి..
మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు,వ్యవహార శైలి అసలు బాలేదు.రాష్ట్రములో నియోజక వర్గాల ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షిస్తున్నాం.వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం’ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన లోకేశ్.. ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు.
నాతో సహా మా పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరుపై రివ్యూ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు,మాట తీరు,వ్యవహారశైలిపై మా వాళ్ల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం.ఇందుకు మూడు నెలల సమయం ఇస్తున్నాం.” అని లోకేశ్ అన్నారు.
