..భారత్ న్యూస్ హైదరాబాద్….దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదు
కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకొని పీడీ యాక్టులు పెడతాం
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిథిలో కబ్జాకు గురైన దేవాదాయ శాఖ భూములను పరిశీలించిన మంత్రి
మొత్తం 3.28 ఎకరాల భూమిని 1968లో టీఎల్పీ ఛారిటబుల్ ట్రస్ట్‌కు భూ పట్టాదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్ ఇతరులు రామయ్య చౌదరితో పాటు మరికొందరికి రిజిస్ట్రేషన్ చేశారు
అనంతరం సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపిన మంత్రి
