వాళ్లిద్దరికీ నోటీసులు ఇస్తాం: మహిళా కమిషన్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. ..వాళ్లిద్దరికీ నోటీసులు ఇస్తాం: మహిళా కమిషన్

AP: అమరావతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన వారికి సమన్లు జారీ చేస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు.

జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాజధానికి చెందిన దళిత మహిళలు ఆమెను కలిసి వినతిపత్రం అందించారు. ‘మహిళా కమిషన్ తరఫున దీనిని సుమోటోగా తీసుకుంటాం. ఇది చాలా సీరియస్ అంశం. మళ్లీ ఇలా వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకుంటాం’ అని శైలజ స్పష్టం చేశారు.