భారత్ న్యూస్ అనంతపురం .. ….కొత్త సమస్యలు సృష్టిస్తున్న
“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”
- వైసీపీ యువనేత గౌతమ్
గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం స్పందన పేరుతో ఆయా జిల్లాలలోని కలెక్టర్స్ మరియు జిల్లాస్థాయి అధికారులు ప్రజల వద్ద నుండి వారి సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యల తీవ్రతను బట్టి ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వీలైన వెంటనే సమస్యలకు పరిష్కారం చూపేవారని…,
ప్రజలలో కూడా స్పందన కార్యక్రమానికి విశేష ఆదరణ లభించిన విషయం అందరికీ తెలిసినదేనని..,
కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ప్రజాదరణ పొందిన అదే స్పందన కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పేరు మార్చి కొనసాగిస్తుండగా సదరు కార్యక్రమం పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించి అర్జీదారుల సమస్యలకు సరైన పరిష్కారం దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని..,
ఎన్నో వ్యయ-ప్రయాసలకు ఓర్చి స్థానికంగా వారికి న్యాయం జరగని సమస్యలపై జిల్లా కేంద్రానికి వెళ్లి అర్జీలు దఖలు చేస్తుండగా వాటిని తిరిగి పరిష్కారo నిమిత్తం ఆయా శాఖల మండల స్థాయి అధికారులకు పంపుచుండగా వారు అదేదో వారిపై ఇచ్చిన ఫిర్యాదుగా భావిస్తూ అర్జీదారులపైనే వారి ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ, వారి ఆఫీసులో అర్జీదారులతో ఫోటోలు దిగి వారిని పంపివేస్తూ మీ సమస్య పరిష్కరించబడింది అని అర్జీలను క్లోజ్ చేస్తున్నారని..,
వారి సమస్య ఎప్పుడు పరిష్కరించబడినదో ఎలా పరిష్కరించబడినదో అర్థం కాక అర్జీదారులు తలలు పట్టుకుంటున్నారని..,సమస్య పరిష్కారం కాలేదని మరల ఆయా శాఖల అధికారుల వద్దకు వెళ్తుంటే కనీసం పట్టించుకోకపోగా మీరు ఎక్కడికి వెళ్లినా తిరిగి మా వద్దకు రావాల్సిందేననే ధోరణిలో వ్యవహరిస్తూ ఉండడంతో అర్జీలు పెట్టుకున్న వారికి ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని..,
అంతేకాకుండా ఇతర పనులపై గతంలో అర్జీలు దాఖలు చేసిన వారు అధికారుల వద్దకు వెళ్తుంటే గతాన్ని సాకుగా చూపుతూ సాధింపు ధోరణితో అధికారులు వ్యవహరిస్తూఉండడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పెట్టడం వలన సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నామని ఆవేదనలో ప్రజలు ఉన్నారని..,
కావున ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారి సమస్యలకు ఉన్నత స్థాయి అధికారుల పరివేక్షణలో పరిష్కరించి పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను ఆన్లైన్లో అప్లోడ్ చేసి, అర్జీ దారులకు పూర్తి న్యాయం చేకూరేవిధంగా చేసి మాత్రమే అర్జీలను క్లోస్ చెయ్యాలని వైసిపి యువనేత గౌతమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
