భవిష్యత్తులో కోర్టు మానిటరింగ్ సిస్టం ను మరింత పటిష్టం చేస్తాం

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…భవిష్యత్తులో కోర్టు మానిటరింగ్ సిస్టం ను మరింత పటిష్టం చేస్తాం

పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్

సమయానికి పోలీసు వారు సాక్షులను ప్రవేశపెట్టడం కానీ, జరుగుతున్నటువంటి వాదోపవాదాలు సమగ్రంగా పరిశీలన చేయడం కానీ, వాటికి సంబంధించి మరుసటి వాయిదాకు ఏ విధంగా తయారు కావాలని ఒక ప్రణాళిక బద్ధంగా చేయటం వలన మరియు న్యాయవ్యవస్థ కూడా వీటి పట్ల ప్రతిస్పందించడంతో ఈ తీర్పులు రావడం జరిగింది అని ఎస్పీ తెలిపారు.

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు శ్రీ ఎస్పీ గారు గడచిన రెండు నెలల కాలంలో కోర్టు నందు శిక్ష పడిన కేసుల గురించి తెలియజేయడం జరిగింది.

గడచిన రెండు నెలల కాలవ్యవధిలో పల్నాడు జిల్లా కు సంబంధించి ఎనిమిది కేసులలో ఏడు కేసులలో ఉన్న ముద్దాయిలకు జీవిత ఖైదు మరియు ఒక కేసులో మరణశిక్ష విధించడం జరిగింది.

ఇందులో ముఖ్యంగా తన్నీరు అంకమ్మరావు @ ముళ్ళపంది అను అతనికి మరణశిక్ష విధించడం జరిగింది.

నాగార్జునసాగర్ కు సంబంధించిన కేసులో 376(D),376(A),302,201 r/w 34 IPC కేసులో ప్రతి సెక్షన్ కు సంబంధించి 5th ADJ,గుంటూరు కోర్టు వారు ముద్దాయిలకు 376(D) సెక్షన్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు 20,000/- రూపాయల జరిమానా,
376(A) సెక్షన్ కు గాను 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు 20,000/- రూపాయల జరిమానా,
302 సెక్షన్ కు గాను జీవిత ఖైదు మరియు 20,000/- రూపాయల జరిమానా,201 సెక్షన్ కు గాను 7 సంవత్సరాల జైలు మరియు 10 వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.

అదేవిధంగా ముందు ఉన్నటువంటి ఏడు కేసులలో 13th ADJ, నరసరావుపేట కోర్టు న్యాయమూర్తి అయిన శ్రీ సత్య శ్రీ గారు ఆరు కేసులలో జీవిత ఖైదు ఇవ్వడం జరిగింది. మిగిలిన సెక్షన్ లకు కూడా శిక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా ఒక కేసులో అయితే మరణశిక్ష విధించడం జరిగింది.

చివరి ఒక సంవత్సర కాలం నుండి ట్రైల్ ప్రక్రియ జరుగుతున్నట్లు దానికి సంబంధించి పల్నాడు పోలీసు శాఖ కోర్టు మానిటరింగ్ సిస్టం ను పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భవిష్యత్తులో కోర్టు మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని ఎస్పీ తెలిపారు.