పాఠశాలల పునఃప్రారంభానికి ఉపాధ్యాయులు గురువారం నుంచి విధుల్లోకి

భారత్ న్యూస్ విజయవాడ…పాఠశాలల పునఃప్రారంభానికి ఉపాధ్యాయులు గురువారం నుంచి విధుల్లోకి వెళ్లాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది.

ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులని, పాఠశాలల సంసిద్ధతకు జూన్ 5న ఉపాధ్యాయులు రావాలని విద్యాశాఖ గతంలో పేర్కొంది. ప్రస్తుతం వారి బదిలీలు కొనసాగుతున్నందున ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.