మెగా డీఎస్సీ నిలుపుదలకు ఏపీ హైకోర్టునిరాకరణ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….మెగా డీఎస్సీ నిలుపుదలకు ఏపీ హైకోర్టు
నిరాకరణ

అమరావతి :

జూన్ 6 నుంచి ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. మెగా డీఎస్సీ నిలుపుదల కోరుతూ వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. డీఎస్సీ పరీక్షలపై స్టే కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లనూ కొట్టేసింది. హాల్ టికెట్లు ఇచ్చామని, పరీక్షలకు ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది..