..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే
ఖాళీ ప్లాట్లలో బోర్డులు ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ

ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న రేవంత్ సర్కార్
ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) చెల్లించాలని.. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05 శాతం వీఎల్టీ చెల్లించాల్సిందేనని తెలిపిన అధికారులు
రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్టీ చెల్లించాల్సిన ప్లాట్లు 31వేల వరకు ఉండగా.. వీఎల్టీ వసూలైతే దాదాపు రూ.110 కోట్ల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు చేరతాయని అంచనా వేస్తున్న అధికారులు
ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్డీ చెల్లించకపోతే బకాయిలున్నట్లు ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు….