భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం
అమరావతి :
ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 21న అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అడ్వైజరీని ఉపసంహరించుకుంది. కొవిడ్ పరిస్థితులను ప్రతిరోజూ DMHO పర్యవేక్షించాలని, ప్రతి కేసును వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వైద్యఆరోగ్యశాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
