రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం..!

భారత్ న్యూస్ కోడూరు

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం..!
🌟🌟
రైతుల ఖాతాల్లో రూ 13,46,241/-వడ్డీ రాయితీ జమ..

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వడ్డీ రాయితీ జమ చేసిందని కోడూరు పిఎసిఎస్ అధ్యక్షులు పూత బోయిన కరుణకుమార్ అన్నారు.

కోడూరు పిఎసిఎస్ లో రుణాలు పొందిన రైతులకు 2023 – 2024 సంవత్సరానికి సంబంధించి మూడు శాతం వడ్డీ రాయితీ నగదు 13,46,241/- రూపాయలు రైతుల ఖాతాల్లో సోమవారం ప్రభుత్వం జమ చేయడం జరిగిందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పూతబోయన శ్రీనివాసరావు,మల్లా వెంకటేశ్వరరావు, సొసైటీ సీఈవో అరజా నగరాయలు పాల్గొన్నారు.