గ్రామ / వార్డు సచివాలయాల పేరు మార్పు – కీలక అప్డేట్

భారత్ న్యూస్ విశాఖపట్నం..గ్రామ / వార్డు సచివాలయాల పేరు మార్పు – కీలక అప్డేట్

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ అధికారికంగా ఆర్డినెన్స్ జారీ చేసింది.

ఇక నుంచి గ్రామ సచివాలయాలను “స్వర్ణ గ్రామ సచివాలయాలు”, వార్డు సచివాలయాలను “స్వర్ణ వార్డు సచివాలయాలు”గా పిలవనున్నారు.

ఈ పేరు మార్పుకు సంబంధించిన చట్ట సవరణకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

గవర్నర్ ఆమోదంతో ఈ ఆర్డినెన్స్‌ను న్యాయశాఖ అధికారికంగా విడుదల చేసింది.