పోటీలలో గెలుచుకున్న మహిళ లకు తహసీల్దార్ గారు, ఎస్‌ఐ గారు బహుమతు లను ప్రదానం చేశారు.

భారత్ న్యూస్ డిజిటల్: అమరావతి:

పోలవరం డీఎస్పీ శ్రీ ఎం. వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, పోల వరం ఇన్స్పెక్టర్ బాల సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో కొయ్యల గూడెం తహసీల్దార్ గారు, కొయ్యలగూడెం ఎస్‌ఐ చంద్రశేఖర్ గారు వారి యొక్క సిబ్బంది తో కలిసి రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా పరింపూడి గ్రామములో మహిళలకు ముగ్గుల పోటీ కార్య క్రమాన్ని నిర్వహించారు.

పోటీలలో గెలుచుకున్న మహిళ లకు తహసీల్దార్ గారు, ఎస్‌ఐ గారు బహుమతు లను ప్రదానం చేశారు.

👉 ప్రతి ప్రాంతంలో పండుగలకు అను గుణంగా జరుపు కోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులు పిలుపునిచ్చారు.

👉జూదా క్రీడలకు, కోడి పందెలు, పేకాట గుండాట కు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టంగాహెచ్చరించారు.

👉 ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగలు జరుపు కోవాలని కోరారు.

👉హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా కోడి పందాలు, పేకాటలు గుండటలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసు కుంటా మని అధికారులు హెచ్చరించినారు.