భారత్ న్యూస్ డిజిటల్:తెలంగాణ:
*కరీంనగర్లో కట్టుదిట్టమైన భద్రత :
కరీంనగర్ బస్టాండ్ మరియు ఆర్టీసీ కార్గో పార్సెల్ కేంద్రంలో తనిఖీలు*
తనిఖీల్లో పాల్గొన్న పోలీసు జాగిలం – లియో
కరీంనగర్: కమీషనరేట్ ప్రజల రక్షణ, శాంతిభద్రతలు, మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశామని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు.
దీనిలో భాగంగా, నగరంలోని రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృతస్థాయిలో, పోలీసు జగిలాలతో తనిఖీలు, ప్రధాన కూడళ్ళలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల కదలికలను గుర్తించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయని సీపీ తెలిపారు.
ఈ భద్రతా చర్యలకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కరీంనగర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 8712670744 కు తెలియజేయాలని విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో పోలీసు కమీషనరేట్ కి చెందిన పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.