భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:
పిఆర్‌సి ని వెంటనే ప్రకటించి అమలు చేయాలి!!
ముత్యాల రవీందర్,
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, TPTF
రెండేళ్ల కింద ప్రకటించాల్సిన కరువు భత్యం ఆరునెలల కింద ప్రకటించి సంక్రాంతి సందర్భంగా జీవో ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని TPTF రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, ముత్యాల రవీందర్ అన్నారు.
అయితే గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని, తమ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో పిఆర్‌సిని ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం… ఎన్నికల ముగిసి రెండేళ్లు దాటినప్పటికీ ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నారనీ, అందుకే పీఆర్సీ నీ వెంటనే ప్రకటించి, అమలు చేయాలని అన్నారు.
ఇప్పటికే ఐదు డీఏ లు బకాయి ఉండగా పండుగ పూట ఒకే ఒక్క డీఏ ప్రకటించడం అన్యాయమని, మిగతా డీఏ లు అన్ని వెంటనే ప్రకటించి విడుదల చేయాలని,
అట్లే ఉపాధ్యాయుల పెండింగ్ జీతాలు, జీపీఎఫ్ బకాయిలు, జీవిత బీమా క్లెయిమ్లు, ఆర్జిత సెలవుల సొమ్ము, నెలల తరబడి పెండింగ్ లోనున్న పెన్షనర్ల పదవీ విరమణ బిల్లులు వెంటనే చెల్లించాలని; అన్ని రకాల ఆర్థిక బిల్లుల చెల్లింపులో అక్రమాలకు తావీయకుండా క్రమ పద్ధతిలో చెల్లించబడేలా చర్యలు తీసుకోవాలని TPTF రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, ముత్యాల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

_ ముత్యాల రవీందర్,
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్