భారత్ న్యూస్ డిజిట్ : వనపర్తి:.
గెలుపు కన్నా క్రీడలలో పాల్గొనడం ముఖ్యం జిల్లా ఎస్పీ :
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సునిత రెడ్డి, ఐపిఎస్.,
➤ రెండు రోజుల పాటు సాగిన పోలీసు స్నేహ క్రీడల ముగింపు కార్యక్రమం
➤ క్రికెట్, వాలీబాల్, టగ్ అఫ్ వారు ఉత్సాహంగా పోటీలు
➤ హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు… ఒక్కటైన పోలీసుల బృందం
➤ విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేసిన జిల్లా ఎస్పీ
వనపర్తి జనవరి 13: పోలీసు అంటే కేవలం చట్ట అమలే కాదు…ప్రజలకు భరోసా కల్పించే సేవా బలగం. నిత్య ఒత్తిడిలో పనిచేసే పోలీసులకు స్నేహ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని అందిస్తాయి. దీని ద్వారా ప్రజల సమస్యలను మరింత ఓర్పుతో విని పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్., గారు అన్నారు.
స్నేహ పూర్వక క్రీడల ముగింపు కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్., గారు హాజరై విజేతలకు ట్రోఫీలు మరియు పతకాలు అందజేశారు.
2 రోజులుగా జరుగుతున్నా స్నేహ పూర్వక క్రీడలలో పోలీసు అధికారులతో పాటు జిల్లా పోలీసు సిబ్బంది క్రికెట్ , వాలీ బాల్ ఆటలలో పాల్గొన్నారు.
ఈ పోలీసు స్నేహ పూర్వక క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ సునిత రెడ్డి, ఐపిఎస్., గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు అంటే ఎల్లవేళలా ప్రజలకు భరోసా రక్షణ కోసం పనిచేసేవారని వారు నిత్యం అనేక ఒత్తిడిలకు గురవుతారని ఈ యొక్క ఆటల ద్వార ఉల్లాసాన్ని అందజేస్తుంది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు తద్వారా ప్రజల యొక్క సమస్యలను మరింత ఓర్పుగా విని వారికి సహాయ పడగలుగుతారని తెలియజేశారు. ఈ క్రీడల వల్ల పోలీసు సిబ్బందిలో స్నేహభావం మరియు సుహృద్భావ సంబంధాలు పెరగాలని ఆకాంక్షించారు. నేర నియంత్రణలో ఎల్లప్పుడూ కృషి చేస్తూ పని ఒత్తిడి నుండి ప్రతి ఒక్కరూ బయటికి రావాలని ఉద్దేశంతో ఈ స్నేహ పూర్వక క్రీడలను నిర్వహించడం జరిగినది హోదాతో సంబంధం లేకుండా హోంగార్డ్ నుండి ఎస్పీ వరకు కలిసికట్టుగా పోటీలో జట్టుగా పాల్గొని వారి ప్రతిభను కనబరిచి ఈ యొక్క స్నేహపూర్వపు క్రీడలను దిగ్విజయం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎస్పి గారు ధన్యవాదాలు తెలియజేశారు.
బహుమతులు
క్రికెట్ విజేతలు
1) మొదటి బహుమతి వనపర్తి సాయిధ దళ పోలీసు టీం
2) ద్వితీయ బహుమతి జిల్లా పోలీసు కార్యాలయం టీం,
వాలిబాల్ విజేతలు
1) మొదటి బహుమతి-
సాయిధ దళ పోలీసు టీం
2) ద్వితీయ బహుమతి-
కొత్తకోట సర్కిల్ పోలీసు టీం
టుగ్ ఫార్ విజేతలు
1) మొదటి బహుమతి హోంగార్డ్స్ టీం
2) ద్వితీయ బహుమతి జిల్లా పోలీసు కార్యాలయం టీం

ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరావు, డిసిఆర్బి డిఎస్పి,,బాలాజీ, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, సిసిఎస్, సీఐ, అశోక్ కుమార్, వనపర్తి సిఐ, కృష్ణ, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని ఎస్సైలు, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.