స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు స్వస్తిక్‌ను తయారు చేయించుకుంటారు. దీనినే గణేశుడి రూపంగా కూడా పరిగణిస్తారు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.అనవసరంగా వివాదం చేయకండి..!!

స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు స్వస్తిక్‌ను తయారు చేయించుకుంటారు. దీనినే గణేశుడి రూపంగా కూడా పరిగణిస్తారు.
దీని ఉపయోగం ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత వస్తుందని నమ్ముతారు. అయితే.. మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్‌లో వేశారు. తాజాగా ఇది వివాదాస్పదం కావడంతో మంత్రి సీతక్క స్పందించి వివరణ ఇచ్చారు.
స్వస్తిక్ గుర్తు విషయంలో ఎవరూ ఎలాంటి వివాదం చేయొద్దు.. మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్‌లో ఉన్న స్వస్తిక్ గుర్తునే పూజిస్తాం.. రివర్స్ స్వస్తిక్ శతాబ్దాలుగా మాకు ఆచారంగా వచ్చింది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి అని సీతక్క విజ్ఞప్తి చేశారు.