భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఏఎస్పీ కార్యాలయం,భద్రాచలం
22.12.2025
ఈ నెల 17వ తేది బుధవారం సాయంత్రం భద్రాచలం,చర్ల రోడ్లోని తిరుమల వైన్స్ షాప్ దగ్గరలో జరిగిన సజ్జ రవి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన పంగి శివ,బోయిన దుర్గా ప్రసాద్,జలకం నాగరాజు లతో పాటు మరొక 06గురు ముద్దాయిలను ఆదివారం నాడు భద్రాచలం సీఐ నాగరాజు అరెస్ట్ చేయడమైనది.వారిని కోర్ట్ లో హాజరుపర్చడం జరిగిందని,మిగిలిన ముద్దాయి కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ వివరాలను వెల్లడించారు.
పట్టుబడినవారి వివరములు
1) పంగి శివ S/o (లేట్) విజయ్, వయస్సు: 24 సం,వృత్తి: కూలి,ఆటో డ్రైవర్, నివాసం: రాజుపేట కాలని, భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.
2) బోయిన దుర్గా ప్రసాద్, తండ్రి పేరు: చందు, వయస్సు: 24 సం, వృత్తి:రాడ్ బెండింగ్ వర్క్, నివాసం: రాజుపేట కాలని, భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.
3) జలకం నాగరాజు, తండ్రి పేరు: రాధ కృష్ణ, వయస్సు: 24 సం,వృత్తి: కార్ డ్రైవర్, నివాసం: ASR కాలనీ భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.
4) బొడ్డు అఖిల్@ అఖిల్ రాజ్, తండ్రి పేరు: వీరయ్య (లేట్), వయస్సు: 21 సం,వృత్తి: కూలి, నివాసం: ASR కాలనీ, భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.
5) లంకపల్లి వెంకటేష్, తండ్రి పేరు: శ్రీను, వయస్సు: 24 సం,వృత్తి: తాపిపని, నివాసం: ASR కాలనీ, భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.
6) ముత్యాల జయరాం, తండ్రి పేరు: నాగేశ్వర్ రావు, వయస్సు: 23 సం,వృత్తి: స్టూడెంట్, నివాసం: టెంపుల్ రోడ్, భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.
7) రిక్క వీర శివ శంకర్ రెడ్డి @ రిక్క శివ @ గుండు శివ, తండ్రి పేరు: భద్ర రెడ్డి, వయస్సు: 25 సం, వృత్తి: తాపి పని, నివాసం: రాజుపేట కాలని భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.
8) కాపుల శివ @ శివ ప్రసాద్, తండ్రి పేరు: గోపి, వయస్సు: 35 సం,వృత్తి: రాడ్ బెండింగ్ వర్క్, నివాసం: MP కాలని భద్రాచలం, కొత్తగూడెం జిల్లా

9) కాపుల కృష్ణ, తండ్రి పేరు: శ్రీనివాస రావు, వయస్సు: 24 సం,వృత్తి: రాడ్ బెండింగ్ వర్క్, నివాసం: MP కాలని భద్రాచలం, కొత్తగూడెం జిల్లా.