భారత్ న్యూస్ డిజిటల్:నల్గొండ:
విపత్తుల సమయంలో ఎక్కువ ప్రాణ నష్టం,ఆస్తి నష్టం సంభవించకుండా అన్ని శాఖల సహకారంతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నల్గొండ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు.
విపత్తుల సమయంలో తక్షణ స్పందన, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం, పెద్దదేవులపల్లి సమీపంలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ లో మాక్ ఎక్సర్సైజ్ ను నిర్వహించడం జరిగింది.
ఫ్యాక్టరీలో కెమికల్ లీకేజీ, అలాగే భవనం కూలిపోవడం, గ్యాస్ లీకేజ్ వంటి సంఘటనల జరిగినప్పుడు వివిధ శాఖల సహకారంతో ఎక్కువ ప్రాణనష్టం,ఆస్తి నష్టం సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలపై కళ్లకు కట్టినట్లుగా మాక్ ఎక్సర్ సైజ్ ను నిర్వహించడం జరిగింది. అగ్నిప్రమాదం, విస్ఫోటనం భవనాలు కూలిపోవడం,ఎలెక్ట్రిక్ సర్జ్యుట్ వంటి విపత్తులు సంభవించి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి అన్ని శాఖల సహకారంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడడం, జతగాత్రులను ఆస్పత్రికి తరలించడం, ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి తీవ్రంగా ఉంటే ఇంకా పై ఆసుపత్రులకు తరలించడం, వంటి దృశ్యాలు మాక్ ఎక్సర్ సైజ్ లో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగిందని,
వివిధ సంస్థలు, ఫ్యాక్టరీలు కార్మికులు పనిచేసే చోట విపత్తులు సంభవిస్తే వారు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, అనుకోని సందర్భంలో విపత్తు సంభవిస్తే ఎలా స్పందించాలో అన్న అంశాలపై వివరించడం జరిగింది.

మాక్ ఎక్సర్సైజ్ అనంతరం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ లో గ్యాస్ లీకేజ్ సంఘటన, అలాగే భవనం కూలిపోయి డామేజ్ అయిన పరిస్థితులలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఫైర్, ఇండస్ట్రీస్, స్టేట్ కమాండ్ కంట్రోల్ నుండి ఆదేశాల మేరకు ఎలా స్పందించాలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించామని, రెండు గంటల పాటు నిర్వహించిన ఈ మాక్ ఎక్సర్సైజులో అన్ని శాఖలు సమర్థవంతంగా వారి విధులను నిర్వహించారని, అన్ని విధాలుగా పరిస్థితులను ఎదుర్కోవడం, ఫ్యాక్టరీ ఇతర సంస్థలలో పనిచేసే సిబ్బందిని విపత్తు సమయంలో సమీకరించడం, ఒకవేళ ఫ్యాక్టరీ నుండి కెమికల్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం, సమిష్టి కృషితో , అన్ని శాఖల సహకారంతో ఎదుర్కొనేందుకు, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల అధికారి సతీష్, జిల్లా ఫైర్ అధికారి సందేశ్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ నరసింహ నేత, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు .వెంకటేశ్వర్లు, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ సైట్ హెడ్ చక్రవర్తి శంకరన్, ఈ ఎస్ డి హెడ్ వెంకట కొండలరావు, సైడ్ సేఫ్టీ హెడ్ డాక్టర్ రవికుమార్, హెచ్ఆర్ హెడ్ జి సుబ్రమణ్యం, త్రిపురారం తహసిల్దార్ ప్రమీల, స్టేడియం ఎస్హెచ్వోలు కృష్ణ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి ,స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు సిహెచ్ శ్రీనివాసులు, సాయి దీపక్, యాదగిరి, తదితరులు హాజరుకాగా, మాక్ ఎక్సర్సైజ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నియమితులైన జనగామ జిల్లా పరిశీలకులు రేమండ్ బాబు, తదితరులు హాజరయ్యారు .