డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అరెస్ట్‌లు

భారత్ న్యూస్ విజయవాడ…డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అరెస్ట్‌లు

రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క‌ డిస్టిల‌రీకి కూడా వైయ‌స్ జగన్ హ‌యాంలో అనుమ‌తి ల‌భించ‌లేదు. గ‌తంలో 4 డిస్టిల‌రీల‌కు కాంగ్రెస్ హ‌యాంలో అనుమ‌తిస్తే, మిగిలిన వాటన్నింటికీ చంద్ర‌బాబే అనుమ‌తిచ్చారు. దాదాపు 200 బ్రాండ్లు త‌యారు చేసే డిస్టిల‌రీల‌న్నీ చంద్ర‌బాబు హ‌యాంలోనే రాష్ట్రంలోకి ప్ర‌వేశించాయి. అలాంటిది డిస్టిల‌రీల నుంచి వైయ‌స్ జ‌గ‌న్ లంచాలు తీసుకున్నాడ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పి చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాడు. సూప‌ర్ సిక్స్ అని చెప్పుకునే ఆరు ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేని అస‌మ‌ర్థుడు చంద్ర‌బాబు. చంద్ర‌బాబుకి ప‌రిపాల‌న చేత‌కాక మా నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపుతున్నాడు. పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు రోజుకో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నాడే కానీ, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న చేయ‌డం లేదు.

-రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు, ప్రొద్దటూరు మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా