ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ నిలిచాడు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ నిలిచాడు. మంగళవారం అబుదాబిలో జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. 2024లో కేకేఆర్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన తన స్వదేశీయుడు మిచెల్ స్టార్క్ రికార్డును గ్రీన్ బద్దలు కొట్టాడు.

జాక్ పాట్ కొట్టిన రవి బిష్ణోయ్.. ఏకంగా రూ. 7 కోట్లకు పైగానే..

తదుపరి సెట్ 7: అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్లు

ఔకిబ్ నబి
రాజవర్ధన్ హంగర్గేకర్

తనుష్ కోటియన్ కనీస ధర 30 లక్షలు

శివాంగ్ కుమార్ కనీస ధర 30 లక్షలు సొంతం చేసుకున్న హైదరాబాద్

కార్తీక్ శర్మ కనీస ధర 30 లక్షలు 14.20 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై పోటీబడ్డ కేకేఆర్,చెన్నై, హైదరాబాద్,

తేజస్వి సింగ్ కి కనీస ధర 30 లక్షలు మూడు కోట్లకు సొంతం చేసుకున్న కేకేఆర్, పోటిబడ్డ ముంబాయి, కేకేఆర్, ఆర్ఆర్,

అకిబ్ ధార్, కనీస ధర 30 లక్షలు, రూ “8.40 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్,

మహిపాల్ లోమ్రోర్

కమలేష్ నాగర్కోటి

విజయ్ శంకర్ కనీస ధర 30 లక్షలు,

సన్వీర్ సింగ్

ఎడెన్ టామ్

ప్రశాంత్ వీర్ కనీస ధర 30 లక్షలు రూ “14, 20 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై తీవ్రంగా పోటీ పడ్డ చెన్నై,హైదరాబాద్,

అన్‌క్యాప్డ్ బ్యాటర్స్ – సెట్ 6లో ఎవ్వరూ అమ్ముడవ్వలే..

అథర్వ తైదే – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు
అన్మోల్‌ప్రీత్ సింగ్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు

అభినవ్ తేజ్రానా – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు

అభినవ్ మనోహర్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు

యష్ ధుల్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు

ఆర్య దేశాయ్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు

ఇప్పటివరకు అమ్ముడైన ఆటగాళ్ళు..

డేవిడ్ మిల్లర్ – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

కామెరూన్ గ్రీన్ – 25.20 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

వానిందు హసరంగా – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్

వెంకటేష్ అయ్యర్ – 7 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

క్వింటన్ డి కాక్ – 1 కోటి – ముంబై ఇండియన్స్

బెన్ డకెట్ – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

ఫిన్ అలెన్ – 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

జాకబ్ డఫీ – 2 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మతీషా పతిరణ – 18 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

అన్రిచ్ నార్ట్జే – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్

రవి బిష్ణోయ్ – 7.20 కోట్లు – రాజస్థాన్ రాయల్స్

అకేల్ హోసేన్ – 2 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్

రవి బిష్ణోయ్ కోసం భారీ పోటీ!

రవి బిష్ణోయ్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) బిడ్డింగ్‌ను ప్రారంభించగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ. 2.20 కోట్లతో పోటీలోకి వచ్చింది.

ఈ రెండు జట్లు బిడ్డింగ్‌ను కొనసాగించడంతో ధర రూ. 4 కోట్లు దాటింది. రూ. 4.40 కోట్ల వద్ద తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు CSK చెప్పినప్పటికీ, వెంటనే రూ. 4.60 కోట్లకు ప్యాడిల్ ఎత్తింది. దీంతో RR కాసేపు ఆలోచించి రూ. 4.80 కోట్లకు బిడ్ వేసింది.

CSK వద్ద ఎక్కువ పర్సు (డబ్బు) ఉన్నప్పటికీ, RR పట్టువదలకుండా పోటీలో కొనసాగుతోంది. ప్రస్తుతం బిడ్ రూ. 6 కోట్ల వద్ద RR చేతిలో ఉంది. చివరకు ఈ బౌలర్ ను రాజస్తాన్ రాయల్స్ టీం వేలంలో రూ.7.20కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

మతీషా పతిరానా కోసం లక్నో, ఢిల్లీ పోరు..
మతీషా పతిరానా కనీస ధర రూ. 2 కోట్లు. ఇప్పటివరకు కేవలం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున మాత్రమే ఆడాడు. ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బిడ్డింగ్ ప్రారంభించగా, వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పోటీలోకి వచ్చింది. ప్రతి బిడ్‌కు రూ. 20 లక్షల చొప్పున పెరుగుతూ, చాలా వేగంగా ఇతని ధర రూ. 5 కోట్లు దాటిపోయింది.

కేఎస్ భరత్ – అమ్ముడుపోలే..
దీంతో మూడవ సెట్ (క్యాప్డ్ వికెట్ కీపర్లు – జాతీయ జట్టుకు ఆడిన వికెట్ కీపర్లు) ప్రారంభమైంది. కేఎస్ భరత్ రూ. 75 లక్షల కనీస ధరతో వేలానికి రాగా, అతను అమ్ముడుపోలేదు.

రూ. 7 కోట్లకు వెంకటేష్ అయ్యర్ సోల్డ్..
మాజీ కేకేఆర్ ఆల్ రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరోసారి అందరికంటే ముందుగా బిడ్ వేసింది. గుజరాత్ టైటాన్స్ (GT) ఇప్పుడు రూ. 2.20 కోట్లతో బిడ్డింగ్‌లోకి వచ్చింది.

రూ. 2.80 కోట్ల వద్ద GT పోటీ నుండి తప్పుకుంది. వెంటనే ఆర్సీబీ (RCB) రూ. 3 కోట్లతో పోటీలోకి వచ్చింది. కానీ LSG ధరను పెంచుతూనే ఉంది. ఆ తర్వాత కేకేఆర్ (KKR) రూ. 3.60 కోట్లతో బిడ్డింగ్‌లో చేరింది. కానీ RCB మరోసారి బిడ్ వేసింది.