భారత్ న్యూస్ విజయవాడ…సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నూతన ఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించిన మోపిదేవి పోలీస్ స్టేషన్ ఎస్ఐ P .గౌతమ్ కుమార్ గారు , చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ K.Y దాస్ గారు, కూచిపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ P . శిరీష గారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్లను ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ…

నూతన ప్రదేశంలో బాధ్యతలను స్వీకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి, నేర నియంత్రణకు తమదైన పాత్రను పోషిస్తూ, అవినీతికి తావు లేకుండా అసాంఘిక శక్తులను అణిచివేయడంలో కీలకంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని సేకరించుకొని ప్రణాళికలు రూపొందించాలని, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని తెలిపారు.