కోకాపేటలో ఎకరం 137 కోట్లు!

..భారత్ న్యూస్ హైదరాబాద్….కోకాపేటలో ఎకరం 137 కోట్లు!

ప్రభుత్వ వేలంలో రికార్డు స్థాయి ధర సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో భూముల ధరలు మరోసారి రికార్డు సృష్టించాయి. తాజాగా సోమవారం జరిగిన వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ 137.25 కోట్లు పలికింది . ప్లాట్ నెంబర్ 17, 18 స్థలాల వేలంలో ఈ రికార్డు ధర నమోదైంది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాల చొప్పున మొత్తం 9.9 ఎకరాల భూమిని వేలం వేశారు. ఈ 9.9 ఎకరాల భూమి ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.1355.33 కోట్ల ఆదాయం వచ్చింది .