జిల్లాలో ప్రజల భద్రతకు ‘విజిబుల్ పోలీసింగ్’

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….జిల్లాలో ప్రజల భద్రతకు ‘విజిబుల్ పోలీసింగ్’
జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తున్నారు.
రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
విజిబుల్ పోలీసింగ్ ద్వారా పోలీసులు ప్రజల మధ్య ఉంటూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. ప్రజలు భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.