విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు 1,085 ఎకరాలు కేటాయింపు

భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు 1,085 ఎకరాలు కేటాయింపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…8,570 కోట్లతో ఏర్పాటుచేయనున్న సూపర్ స్మెల్టెర్స్

విజయనగరం జిల్లా గుర్ల మండలం కెళ్ల గ్రామంలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా సూపర్ స్మెల్టెర్స్ లిమిటెడ్ కు 1,085 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ సంస్థ 8,570.50 కోట్లతో ఏడాదికి 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్స్టాంట్ ఏర్పాటు చేస్తుంది.

దీనిద్వారా 750 మందికి ఉపాధి కలగనుంది. టౌన్ షిప్ ఏర్పాటుకు మరో 97.04 ఎకరాలు, రైల్వే సైడింగ్కు 53.35 ఎకరాలు కూడా కేటాయించనున్నారు.
రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.