.ఇదేం వెర్రి కామెడీ..?వీసీ సజ్జనార్ ఆగ్రహం

వీసీ సజ్జనార్ ఆగ్రహం

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఇదేం వెర్రి కామెడీ..?

వీసీ సజ్జనార్ ఆగ్రహం

సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న మితిమీరిన చేష్టలపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, ప్రాంగణాల్లో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేది లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు.

ఇలాంటి ‘వెర్రి కామెడీ’లతో నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం తగదని ఆయన హితవు పలికారు.

ఈ మేరకు బస్సు కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియోను సజ్జనార్ పంచుకున్నారు.

“ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి చేష్టలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.

ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు….