..భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో
పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భక్తకోటికి శుభాలు కలగాలని ప్రార్థించారు. 12 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక పుష్కర మహోత్సవంలో పాల్గొనే భక్తులకు సర్వదా ముక్తేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గోదావరి, ప్రాణహిత నదుల అంతర్వాహిని సరస్వతీ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దేవీ మహా సరస్వతి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని కోరారు…..
