భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ
తెలంగాణ :
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నేడు, రేపు విచారణ చేపట్టనున్నారు.
ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్లు చేయనున్నట్టుగా స్పీకర్ కార్యాలయం తెలిపింది.

ఈ మేరకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, శేరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నారు.