బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ

భారత్ న్యూస్ ఢిల్లీ….బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ

బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 18 జిల్లాల 121 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 45,341 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

జేడీయూ 57, భాజపా 48, ఎల్‌జేపీ 14, ఆర్‌జేడీ 73, కాంగ్రెస్‌ 24 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని జన్‌సురాజ్‌ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు.