నేపాల్‌లో హిమపాతం: ఏడుగురు పర్వతారోహకులు మృతి

భారత్ న్యూస్ గుంటూరు…నేపాల్‌లో హిమపాతం: ఏడుగురు పర్వతారోహకులు మృతి

నేపాల్‌లో విషాధ ఘటన నెలకొంది. 15 మంది సభ్యులతో కూడిన పర్వతారోహణ బృందం యాలంగ్ రి పర్వతాన్ని అధిరోహిస్తుండగా, ఒక్కసారిగా భారీగా మంచు విరిగిపడింది. ఈ ఘటనలో ఏడుగురు సభ్యులు మంచు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు ఫ్రెంచ్ పర్వతారోహకులు, ఒక కెనడా పౌరుడు, ఒక ఇటాలియన్, అలాగే ఇద్దరు నేపాలీలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే ప్రమాదంలో మరో నలుగురు కనిపించకపోవడంతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి….