భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తాడ్వాయి: నేడు మేడారం హుండీల లెక్కింపు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం లెక్కించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయ ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన హుండీలను హుండీల కౌంటింగ్ హాల్లో లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియలో రెవెన్యూ, పోలీస్ అధికారులు, పూజారులు హాజరుకానున్నారు….
