భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. తూప్రాన్ మండల పరిధిలోని మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, కోనాయిపల్లి అడవి ప్రాంతంలో గత మూడు రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత పులిని చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్ లో చిరుత పులి చిత్రాలను చిత్రీకరించారు. చిరుతపులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంతో గురవుతున్నారు. చిరుత పులిని బంధించే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు
