భారత్ న్యూస్ విజయవాడ…సమస్యలు శాశ్వతంగా పరిష్కరించి ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ ఆదివారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు.
కేంద్రంతో ఇదివరకే సంప్రదించామని, ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు….
