ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవు.. సంక్షేమ పథకాలకే డబ్బులు సరిపోవడం లేదు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవు.. సంక్షేమ పథకాలకే డబ్బులు సరిపోవడం లేదు

ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు భట్టి విక్రమార్క స్పష్టీకరణ

ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 15వ తేదీ నుండి కాలేజీలు మూసివేస్తామని ప్రకటించిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు

ఈ నేపధ్యంలో శనివారం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యి, వెంటనే పెండింగ్ బకాయిల నిధులు విడుదల చేయాలని కోరిన కాలేజీల యాజమాన్య సంఘాలు

యాజమాన్యాల డిమాండ్లపై స్పందిస్తూ, మీకు ఇవ్వడానికి ఒక్క రూపాయి కూడా లేదు సంక్షేమ పథకాలకే డబ్బులు సరిపోవడం లేదు అంటూ బదులిచ్చిన భట్టి విక్రమార్క

దీంతో ఆదివారం సమావేశమై, చర్చించుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పిన కాలేజీల యాజమాన్యాలు