ఏపి కి మరో కేంద్ర మంత్రి పదవి

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపి కి మరో కేంద్ర మంత్రి పదవి

సమీకరణాలు

A. Udaya Shankar.sharma News Editor…కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవి పైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు – పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాగా, అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

రేసులో ఉన్నదెవరు

ప్రస్తుతం ఉత్తరాంధ్ర.. కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో, ప్రాంతీయ – సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకా శం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రెడ్డి వర్గానికి ఇస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రధానంగా రేసులో వినిపిస్తోంది. జనసేనకు దక్కితే బాలశౌరి పేరు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. బీజేపీ తీసుకుంటే పురందేశ్వరి లేదా సీఎం రమేశ్ లో ఒకరిని ఎంపిక చేస్తారా అనే చర్చ జరుగుతోంది. దీంతో.. దసరా తరువాత కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందనేది అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.