కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా!

భారత్ న్యూస్ విజయవాడ…కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా!కొత్త జిల్లాల కోసం ఉపసంఘం ఏర్పాటు – రాజధాని పరిధిలో కొత్త జిల్లాకు అవకాశం

A. Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటి నుంచి అనేక వివాదాలు, అసంతృప్తులు వెల్లువెత్తాయి. ప్రజల అభిప్రాయాలను సక్రమంగా సేకరించకుండానే తీసుకున్న ఆ నిర్ణయం గందరగోళానికి దారి తీసిందని విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది.

ఉపసంఘం ఏర్పాటు: జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రజల వినతులు స్వీకరించడం ప్రారంభించింది. జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. అందిన ప్రతిపాదనలన్నింటినీ సమీక్షించిన తర్వాత ఉపసంఘం అసెంబ్లీ సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించనుంది.

గడువు తేది స్పష్టంగా: జనగణన షెడ్యూల్ కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరక