విజయవాడ ఉత్సవ్’ పేరిట ఎగ్జిబిషన్‌ – సెప్టెంబరు 22న ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్​తో ఆరంభం

భారత్ న్యూస్ రాజమండ్రి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ ఉత్సవ్’ పేరిట ఎగ్జిబిషన్‌ – సెప్టెంబరు 22న ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్​తో ఆరంభం

దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ పేరిట కార్యక్రమం – సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడోత్సవాలు, 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగ్జిబిషన్‌ ఆరంభం కావడం విశేషం

దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్‌ పేరుతో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకు విజయవాడ నగరంలో పెద్దఎత్తున వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా పర్యాటకానికి జవసత్వాలు అందించేలా ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో: ప్రముఖ సినీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణానదీ తీర ప్రాంతం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్‌ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానాల్లో సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను నిరంతరాయంగా 11 రోజులు నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శనలు: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా కృష్ణా నదిలో పడవల పోటీలు ఉంటాయి. జలక్రీడలు, డ్రోన్‌ షో, కిడ్స్‌ జోన్స్, అమ్యూజ