భారత్ న్యూస్ మంగళగిరి….సీబీఐకి సుగాలి ప్రతీ కేసు !
📍సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
సుగాలి ప్రతీ తల్లి న్యాయం చేయలేదని పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దాడి చేస్తూండటం, వైసీపీ నేతలతో కలసి రాజకీయ ఆరోపణలు ప్రారంభించడంతో ప్రభుత్వం వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ కేసును సీబీఐకి సిఫారసు చేయాలని నిర్ణయించారు.నాలుగో తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కేంద్ర హోంశాఖకు పంపుతారు.
నిజానికి ఈ కేసును వైసీపీ ప్రభుత్వంలోనూ సీబీఐకి అప్పగిస్తూ సిఫారసు చేశారు.కానీ అప్పటి ప్రభుత్వం నాన్ సీరియస్ గా వ్యవహరించింది. తమకు వనరుల్లేవని సీబీఐ వాదించింది.దాంతో ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ విచారణ చేయించారు.అయితే అప్పటికే సాక్ష్యాలు సరిపోలకపోవడం,కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని సీఐడీ గుర్తించింది. దీంతో కేసు ముందుకు కదల్లేదు. ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సాయాన్ని అందేలా పవన్ చేశారు.
అయితే ఇప్పుడు మళ్లీ ఈ అంశాన్ని రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తూండటంతో సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించారు.గతంలోలా కాకుండా ఈ సారి సీరియస్ గా దర్యాప్తు జరిగేలా చూడనున్నారు. 2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో కనిపించారు.ఆమెను అత్యాచారం చేసి చంపారని తల్లి ఆరోపించారు.అయితే ఆధారాల్లేకపోవడంతో స్కూల్ నిర్వాహకులపై ఆత్మహత్య ప్రేరణ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా.. ఆ ప్రభుత్వంపై విమర్శలకు సుగాలి ప్రతీ కేసు ఓ ఆయుధంగా మారుతోంది.
