మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయి?

భారత్ న్యూస్ అనంతపురం….మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయి?

మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు

చల్లపల్లిలో “బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ”

చల్లపల్లి:
ఎన్నికల ముందు మానిఫెస్టోలో చంద్రబాబునాయుడు అనేక వాగ్దానాలు చేశారని వాటిని అమలు చేయటంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయసార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం “బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటి”పై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ 19 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నగదు పంపిణీ, నిరుద్యోగ భృతి, ఇప్పటి వరకూ ఎందుకు అమలు పరచలేదని ప్రశ్నించారు. తల్లికి వందనం మొదటి విడత డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ప్రజలకు చెప్పాలని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. జగన్మోహనరెడ్డి వస్తుంటే బ్యారికేడ్లు అడ్డుపెట్టినా, ముళ్ళ కంచెలు వేసినా, రోడ్లకు గండ్లు కొట్టినా.. ఎన్ని ఆంక్షలు విధించినా… కొండలు, గుట్టలు, కాలువలు, నదులు అన్నీ దాటుకుని సంఘీభావంగా జగన్మోహనరెడ్డిని కలిసేందుకు ప్రజలు తండోపతండాలుగా రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను గెలిపించుకోకపోతే పేదప్రజలకు మరింత అన్యాయం జరుగుతుందని ప్రజలు గొంతెత్తి చెపుతున్నారని నొక్కి చెప్పారు. బాబు మోసాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారని