భారత్ న్యూస్ రాజమండ్రి ….లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కమిషనర్ రూ.23వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అరుణాచలం ద్వారా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు..
