భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ :
నేటి నుంచి చేపల వేట పునఃప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఆదివారం నుంచి చేపల వేట తిరిగి ప్రారంభం కానుంది.
ఈ మేరకు ఇప్పటికే మత్స్యకారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.

చేపల వేట తిరిగి ప్రారంభం కావడంతో తీర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
గంగమ్మకు మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేసి చేపల వేట ప్రారంభించనున్నారు.
కాగా, సముద్రంలో చేపలు వృద్ధి చెందేందుకు 2 నెలల పాటు ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది.