భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఒంటిపూట బడుల అమలు & ఉపాధ్యాయుల హాజరు విధానం
📌ఒంటిపూట బడులు (Half-day Schools):
📌 తేదీలు: 16.03.2026 నుండి 23.04.2026 వరకు
📌 తరగతులు:- 1 నుండి 9 తరగతుల వరకు
📌 సమయం:- ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు
📌పదవ తరగతి పరీక్షా కేంద్రాలు (SSC Exam Centers):-
పరీక్షా రోజుల్లో తరగతులు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు జరుగుతాయి.
పరీక్షలు లేని రోజుల్లో సాధారణ పాఠశాల సమయాల ప్రకారం ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి.
📌 ఉపాధ్యాయుల ఫేషియల్ అటెండెన్స్ (Facial Attendance) సూచనలు :-
1.అటెండెన్స్ టైమింగ్ :-
ఉదయం 7:45 లోపల “ఇన్-టైమ్” నమోదు చేయాలి.
మధ్యాహ్నం 12:30 తరువాత “అవుట్-టైమ్” నమోదు చేయాలి.
2.వన్ సెక్షన్ సమయంలో సెలవులు :-
ఒంటిపూట బడులు అమలులో ఉన్న కాలంలో 1/2 డే క్యాజువల్ లీవ్ (1/2 CL) పెట్టరాదు.
అప్రూవ్ కూడా చేయరాదు.
3.SSC డ్యూటీ :-
📌SSC పరీక్షల డ్యూటీకి వెళ్లే ఉపాధ్యాయులు, అటెండెన్స్ యాప్లో “SSC డ్యూటీ” నమోదు చేయాలి.
📌ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి.

📌పరీక్షలు లేని రోజుల్లో పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.